వేదాల్లో ప్రస్తావించబడ్డ #ఖగోళశాస్త్ర విషయాలు. ఆధునిక విజ్ఞానశాస్త్రజ్ఞులు కూడా కనుగొన్నవి. ఈ ఖగోళ విషయాలు కనుగొనడానికి, అంగీకరించడానికి పాశ్చాత్య ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.
భూభ్రమణానికి చెందిన విషయాలు
భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికి అది ముందుకు కదులుతుంది. దాంతో పాటు దానిపైన ఉన్నవి కూడా కదులుతాయి. భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుంది - ఋగ్వేదం 10.22.14
ఏ విధంగానైతే ఒక శిక్షకుడు తను కొత్తగా శిక్షణ ఇచ్చే గుర్రాలను తన చుట్టు తిప్పుకుంటాడో, అట్లాగే సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను తన అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - ఋగ్ #వేదం 10.149.1
#గురుత్వాకర్షణ శక్తికి చెందిన విషయాలు
ఓ ఇంద్రుడా! అయస్కాంతశక్తి, ఆకర్షణ శక్తి - ప్రకాశం, కదిలకలు వంటి గుణాలు కలిగిన నీ దివ్య కిరణాల చేత ఈ సమస్త విశ్వాన్ని నిర్ణీత పద్ధతిలో నడిపిస్తున్నావు. ఈ విశ్వమొత్తం గురుత్వాకర్షణ శక్తి చేతనే నడుస్తోంది - ఋగ్ వేదం 8.12.28
సూర్యుడు తన కక్ష్యలో తాను తిరుగుతున్నా, భూమి మొదలైన ఇతరత్రా గ్రహాలు, అన్యపదార్ధాలను కూడా ఒకదానికొకటి ఢీకొనకుండా ఆకర్షణ శక్తి ద్వారా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - యజుర్వేదం 33.43
సూర్యుడు తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడు అందరికంటే బరువైనవాడు, పెద్దవాడు అవ్వడం వలన తన యొక్క ఆకర్షణ శక్తి చేత భూమి మొదలైన గ్రహాలు ఆయన చుట్టు తిరుగుతాయి - ఋగ్వేదం 1.164.13 (మనమున్న విశ్వంలో సూర్యుడే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం. గ్రహాలు, శకలాలు అనేకం ఉన్నా, అన్నిటికంటే పెద్దది సూర్యగోళమే. సూర్యుడే ఈ విశ్వానికి ఆధారభూతమై ఉన్నాడని ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా తెలుసుకున్నమాట అందరికి విధితమే. ఈ విషయాన్ని ఋగ్వేదం కొన్ని కోట్ల ఏళ్ళ క్రితమే స్పష్టం చేసింది.)
సూర్యుడే భూమిని, ఇతర గ్రహాలను పట్టి ఉంచాడు - అధర్వణవేదం 4.11.1 (సూర్యుడిలో గురుత్వాకర్షణశక్తి లేకపోతే, ఈ విశ్వం సజావుగా నడవదు. అంతా గందరగోళంగా తయారవుతుంది.)
చంద్రుని కాంతి గురించి - #చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యుడి మీద ఆధారపడ్డవాడన్న విషయం కూడా వేదం ప్రస్తావించింది.
భ్రమణం కలిగిన చంద్రుడు ఎప్పుడు సూర్యుడి నుంచి వెలుగును (కాంతి కిరణాలను) గ్రహిస్తాడు - ఋగ్వేదం 1.84.15
చంద్రుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాతింబవళ్ళు ఆ వివాహానికి హాజరయ్యాయి. సూర్యుడు తన కూమర్తే అయిన సూర్యకిరణాన్ని ఇచ్చి వివాహం చేశాడు - ఋగ్వేదం 1.85.9 (భార్యభర్తలు విడదీయరానివారు. ఒకరు లేకుండా ఇంకొకరిని ఊహించడం అసాధ్యం. అట్లాగే సూర్యకాంతి లేని చంద్రుడిని ఊహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యకాంతి మీద ఆధారపడ్డవాడు. అందుకే వేదం ఈ ఉపమానం వేసింది.)
#గ్రహణం గురించి - ఈ మధ్య ఒక కొత్త ప్రచారం ఊపందుకుంది. హిందువులకు గ్రహణం గురించి తెలియదు, చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య అడ్డురావడం వలన సూర్యగ్రహణం, భూమి నీడ చంద్రుడిపై పడడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ వీళ్ళేదో పాములు వచ్చి మింగేస్తాయని చెప్తారు అంటున్నారు. అటువంటి వారికి ఇది కనువిప్పు కావాలి. రాహుకేతువులు అనగా ఛాయలు (నీడలు) మాత్రమే. రాహుకేతువులను సర్పాలుగా పురాణంలో చెప్పగా, వేదం గ్రహణం గురించి అసలు ప్రక్రియ వెల్లడించింది. పురాణంలో ఉన్న విషయాలన్నిటిని యధాతధంగా స్వీకరించకూడదు. వాటిలో అనేక రహస్యాలు, ఉపాసనా పద్ధతులు నిక్షిప్తమై ఉంటాయి. వేదం అనాది. అందులో గ్రహణం గురించి ఏమూందో చూడండి.
ఓ సూర్యుడా! నీవు ఎవరికి కాంతిని బహుమతిగా ఇస్తున్నావో, అతడే (చంద్రుడే) నీ కాంతికి అడ్డుతగలడంతో (భూమికి సూర్యుడికి మధ్య అడ్డురావడంతో) కముకున్న చీకటివలన భూమి (భూమిపై ఉన్న జీవరాశి అని అర్దం చేసుకోవాలి) భీతిల్లుతోంది - ఋగ్వేదం 5.40.5
(ఆధారం: https://www.facebook.com/vedasamskruti/posts/1624555411128245)
No comments:
Post a Comment